పిఎం జన్ మాన్ కార్యక్రమం ప్రాధాన్యతగల కార్యక్రమం అని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం జన్ మాన్ కార్యక్రమం కింద జిల్లాలో 5, 853 గృహాలను గిరిజనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఇంకా 2, 967 గృహాల నిర్మాణం ప్రారంభం కాకపోవడాన్ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు.