పిడుగులు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణంలో మార్పులపై రాష్ట్ర విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా కూడా అందిస్తుందని, వాటి ఆధారంగా ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.