పార్వతీపురం పట్టణనికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వంగల దాలినాయుడు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా జరిగిన జై బాపు, జై భీమ్, సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దాలినాయుడుకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.