జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా తెలిపారు. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయన పరిశీలించారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా వేతనదారులు తమ గ్రామం లోనే పనులను చేసుకొని వేతనాన్ని పొందవచ్చని అన్నారు.