పార్వతీపురం మండలం ఆర్ కె బట్టివలస గ్రామ వద్ద మంగళవారం ఎన్ఫోర్మెంట్ అధికారులు నాటుసారా పట్టుకున్నారు. బాలగుడబ గ్రామానికి చెందిన బంగారి, వెంకటరమణ గత కొద్ది రోజుల నుంచి ఆర్ కె బట్టివలస నుంచి నాటుసారా తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంకటరమణ కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం 200 లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా అతని వద్ద నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.