పార్వతీపురం: అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలి

56చూసినవారు
పార్వతీపురం: అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలి
పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అడ్మిషన్ లు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థుల విద్యా ఆరోగ్య స్థాయిలను గూర్చి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను అందరూ ఒకటవ తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్