పార్వతీపురం: మలేరియా నియంత్రణకు విస్తృతంగా చర్యలు

13చూసినవారు
పార్వతీపురం: మలేరియా నియంత్రణకు విస్తృతంగా చర్యలు
మన్యం జిల్లాలో మలేరియా నియంత్రణ ధ్యేయంగా లక్ష గంబూషియా చేపలను మొదటి విడతగా సరఫరా చేశామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు అన్నారు. ఈ మేరకు కొత్తవలస చెరువులో శనివారం ఆయన గంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ముందుగా గుర్తించిన 178 చెరువుల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డా. భాస్కరరావు మాట్లాడుతూ చెరువులో ఉన్న దోమల లార్వాలు తినడం గంబూషియా చేపల ప్రత్యేకత అని తెలిపారు.

సంబంధిత పోస్ట్