ఐటిసి, ప్రధమ్ సంయుక్తంగా నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ, ఉద్యోగ కల్పన జరుగుతుందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధమ్ సంస్థ ద్వారా వెనుకబడిన, అర్ధాంతరముగా స్కూల్ మానివేసిన 18 నుండి 30 సం. మధ్య వయస్సు గల యువతీ యువకులకు ఒకేషనల్ స్కిల్స్ కోర్సులలో 45 రోజులు శిక్షణ ఇస్తుందని అన్నారు.