మన్యం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జూలై 10న జరుగుతుందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్ని విద్యాసంస్థలు నిర్వహించాలన్నారు.