ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యువత పోరు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు తదితరులు పాల్గొన్నారు.