జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను పర్యవేక్షించిన పీఓ

61చూసినవారు
జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను పర్యవేక్షించిన పీఓ
పార్వతీపురం పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ యందు నిర్మించబోతున్న జీడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఐటిడిఏ పి ఓ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు, సిబ్బందికి ఆయన పలు సూచనలు, మార్గదర్శకాలతో దిశా నిర్దేశం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్శనలో గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ మణిరాజ్, ఏపీఓ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్