కురుపాం మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గోపాలరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యానం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నామని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా విద్యుత్ ముడిపడి ఉన్నటువంటి ఇంటి అవసరాలన్నీ చేసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు.