జియమ్మవలస మండలంలోని పెద్ద బుడ్డిడి, డంగభద్రవలస ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఎస్. ఎం. సి ఎన్నికలు నిర్వహిస్తూన్నామని ఎంఇఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 8న వివిధ కారణాలతో ఆయా పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురేసి చొప్పున సభ్యులను ఎంపిక చేసి ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు