పెదఖేర్జలలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

78చూసినవారు
పెదఖేర్జలలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కొమరాడ పీహెచ్సీ వైద్యులు అరుణ్ కుమార్ అన్నారు. పెదఖేర్జల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఆరోగ్య తనిఖీలను నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాచి చల్లారిన మంచినీరు విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో వసతి గృహ నిర్వాహకులు సీతారాం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్