పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం పట్టణ భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేం దుకు వీలుగా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అరసవిల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులన్నీ సాధారణ చార్జీలతోనే నడుపుతున్నట్లు చెప్పారు.