కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మిపురం మండలానికి మండల విద్యాశాఖ అధికారి-2గా ఊయాక భాస్కరరావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు బామిని విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం ఎంఈవో నుంచి జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయునిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే గుమ్మ లక్ష్మీపురం ఎంఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న జనార్ధన్రావు గత నెలలో పదవీ విరమణ పొందగా. ఆయనకు బాధ్యతలు అప్పగించారు.