శనివారం సాయంత్రం కురుపాం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వర్షం ఆరుతడి పంటలకు మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అటు విజయనగంలోనూ వర్షం దంచికొట్టింది.