బకాయి వేతనాల చెల్లింపును డిమాండ్ చేస్తూ శుక్రవారం బాడంగి ఎంపీడీవో కార్యాలయాన్ని గ్రీన్ అంబాసిడర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ఎ.సురేశ్ మాట్లాడుతూ, నెల నెలా వేతనాలు లేక గ్రీన్ అంబాసిడర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించి, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.