ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలో ఆదివారం జరిగింది. ముంజేరుకు చెందిన మొగసాల శ్రావణి తగరపువలసలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఇంటర్ పరీక్షల్లో తప్పడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామాకు సుందరపేట పిహెచ్సికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.