విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోనాడ ఎల్లాజీ దేవునికి పూజ చేసిన పూలు చెరువులో కలిపేందుకు వెళ్ళాడు. చెరువులో తెగిపడిన కరెంట్ తీగలను చూసుకోకుండా చెరువులోకి దిగడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.