భోగాపురంలో శనివారం వివిధ రంగాల కార్మికులతో సీఐటీయూ నాయకులు టీవీ రమణ, సూర్యనారాయణ సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ.. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడానికే ఈ పోరాటం జరుగుతోందని, అందరూ మద్దతు ఇవ్వాలన్నారు.