విజయనగరం జిల్లా వ్యాప్తంగా రేపు పోలి పాడ్యమి పర్వదినం సందర్భంగా సముద్ర, నదీ తీరాలు, శివాలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైన్ స్నాచింగ్ జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, మఫ్టీలో సిబ్బందిని నియమించాలని స్టేషన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలో జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.