నెల్లిమర్ల పట్టణం జనసేన పార్టీ నాయకుడు రవ్వా నాగేంద్రవర్మ(నాని)కి చెందిన కారు అద్దాలను పగలగొట్టారని స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్డీయే కూటమి నాయకులు కడగల ఆనంద్ కుమార్, లెంక అప్పలనాయుడు తదితరులతో కలిసి నాని పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లిమర్ల పట్టణ, మండల రాజజీయాల్లో నాని చురుగ్గా పాల్గొంటున్నారన్నారు.