డెంకాడ మండలంలోని బొడ్డవలస గ్రామంలో పేకాట శిబిరంపై డెంకాడ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టగా. గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 18, 020 నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశారు.