కొత్తవలస మండలం మంగళపాలెం శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ కుమార్ ఇంటి పూజామందిరంలో గత నెల 28న జరిగిన భారీ చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన మిథూన్ పిరాజి పవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ షణ్ముఖరావు నేతృత్వంలో పోలీసు బృందం మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని పట్టుకుని ట్రాన్సిట్ రిమాండుపై కొత్తవలసకు తీసుకొచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా ఈ చోరీలో ఆ రాష్ట్రానికి చెందిన ఆరుగురు పాల్పడ్డారు.