నెల్లిమర్ల ఎంపీడీఓ ఆఫీస్ లో విజన్-2047 కార్యాలయాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆమె విజన్-2047 లక్ష్యాల గురించి వివరించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎంపీడీఓ రామకృష్ణంరాజు, తహసిల్దార్ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.