రేపు (ఆదివారం) విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా కొంతసేపు కరెంట్ నిలిపివేస్తున్నట్టు ఈఈ పి. త్రినాథ్ తెలిపారు. నెల్లిమర్ల సబ్‌స్టేషన్ పరిధిలో జరిగే పనుల నేపథ్యంలో మండలంలోని కొండగుంపాం, గరికిపేట, పూతికపేట గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ముందస్తుగా గమనించాలని సూచించారు.