నెల్లిమర్ల: రేషన్ డిపో తెరవకపోవడంపై ఆగ్రహించిన కౌన్సిలర్

60చూసినవారు
నెల్లిమర్ల: రేషన్ డిపో తెరవకపోవడంపై ఆగ్రహించిన కౌన్సిలర్
నెల్లిమర్ల నగర పంచాయతీ 15వ వార్డులో రేషన్ డిపో తెరవకపోవడంపై 14వ వార్డు కౌన్సిలర్ జానా సంధ్యారాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపోకు తాళం వేయడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం 15 రోజులు డిపో తెరిచి ఉంచాలని ఆదేశించినా ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్