కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని జిల్లా టిడిపి అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. నెల్లిమర్ల మండలం కొత్తకోటలో శనివారం ఆయన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.