యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని డి ఆర్ డి ఏ పిడి కళ్యాణ చక్రవర్తి అన్నారు. నెల్లిమర్ల మండలం రామతీర్థం లో గురువారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు యోగాసనాలు వేశారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని కోరారు. ఈనెల 21న విశాఖలో ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ యోగ దినోత్సవానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.