నెల్లిమర్ల: జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఇంటర్ విద్యార్థిని

51చూసినవారు
నెల్లిమర్ల: జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఇంటర్ విద్యార్థిని
నెల్లిమర్ల సీ కే ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బర్ల లలిత ఇంటర్బైపీసీ సెకండియర్సెకండరీ పరీక్షల్లో 989 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ఈమె జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించి తన ప్రతిభ కనబరిచింది. మన్యం జిల్లా చిన మేరంగి గ్రామానికి చెందిన ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితర సిబ్బంది ఈ సందర్భంగా లలితను అభినందించారు.

సంబంధిత పోస్ట్