నెల్లిమర్ల ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు నాగేశ్వరరావు, నాగేశ్వరరావులు తమ సిబ్బందితో కలిసి గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న అత్తాడ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది అప్పారావు, సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.