నెల్లిమర్ల: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
నెల్లిమర్ల: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లిమర్ల మండలం రామతీర్థం, పతివాడ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మత్తులు చేపట్టనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ త్రినాధరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండలంలో బొప్పడాం, వల్లూరు, పిన తరిమి, పెద తరిమి, మల్యాడ, ఒమ్మి గ్రామాలకు సోమవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు గమనించి, సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్