నెల్లిమర్ల పట్టణ కేంద్రం నెల్లిమర్లలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులు సంభవించాయి. రోజంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన పట్టణవాసులు వర్షంతో ఉపశమనం పొందారు. రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.