నెల్లిమర్ల మండలంలోని పెద్దతరిమి సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ మీద కూలీలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. ట్రాక్టర్ రోడ్డుకి అడ్డంగా పడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు తెలిపారు.