నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా నగర పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కాలనీలో గల సర్వే నెంబర్ 60 లోని 1. 17 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని కమిషనర్ కే అప్పలరాజు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా అక్రమంగా కట్టడాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.