పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్ధంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ సమీపంలో గురువారం భారీ యోగా ప్రదర్శన నిర్వహించారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ వందలాదిమంది చెక్కుచెదరని దీక్షతో యోగాసనాలు వేసి, తమ నిబద్దతను ప్రదర్శించారు. ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాభ్యాసన చేయాలని కోరారు. మానసిక, శారీరక ఆరోగ్య సాధనకు యోగా దివ్య ఔషధం అని పేర్కొన్నారు.