నెల్లిమర్ల మండలం కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీడీవో కృష్ణంరాజు ఆధ్వర్యంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాను మన జీవితంలో దినచర్యలో భాగంగా చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం యోగా శిక్షకుడు పైడిరాజు సమక్షంలో పలు యోగాసనాలు చేశారు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.