పూసపాటిరేగ మండలం గోవిందపురం లో ఎక్సైజ్ పోలీసులు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి వద్దనుండి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సి ఐ వి రవికుమార్ శనివారం తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో ఎస్సై చంద్రమోహన్, హెచ్ సి సత్యనారాయణ, కానిస్టేబుల్ శిరీష తదితరులు పాల్గొన్నారు.