భోగాపురంలో వైన్ షాపులను జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ బి. శ్రీ నాథుడు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్థానిక ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం భోగాపురం లో ఉన్న మద్యం దుకాణాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. వీటితోపాటు ఖరీదైన మద్యం కూడా అమ్మకాలు చేపట్టాలని ఆయన సూచించారు. చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలని లేనిచో ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు.