విజయనగరం: రెండేళ్లు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదని ఎస్పీకి ఫిర్యాదు

69చూసినవారు
విజయనగరం: రెండేళ్లు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదని ఎస్పీకి ఫిర్యాదు
ఇంట్లో 7 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై గరివిడి మండలానికి చెందిన వృద్ధురాలు సత్యవతమ్మ ఎస్పీ వకుల్ జిందాల్ ఎదుట ప్రజావేదికలో సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. "దొరికితే ఇస్తాం కదా" అంటూ పోలీసులు కాలయాపనం చేస్తున్నారని వాపోయారు. మరో వృద్ధురాలు పైడమ్మ కూడా ఏడాది క్రితం ఆటోలో ధర్మపురి నుంచి నెల్లిమర్ల వెళ్తుండగా తన తులన్నర బంగారు గొలుసు తెంపుకొని పోయారని  కేసు నమోదు చేయలేదని రోజూ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని ఎస్పీ ఎదుట విన్నవించారు.

సంబంధిత పోస్ట్