ట్రిపుల్ ఐటీలో 19 మంది విద్యార్థులు ఎంపిక

55చూసినవారు
ట్రిపుల్ ఐటీలో 19 మంది విద్యార్థులు ఎంపిక
వీరఘట్టం మండలంలో 19 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించినట్లు ఎంఈఓ ఆనందరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. తలవరం జిల్లా పరిషత్ హై స్కూల్కి చెందిన 9 మంది, నీలానగరం హైస్కూల్ కు చెందిన 6 గురు, తెట్టంగి హైస్కూల్ కు చెందిన ఇద్దరు, రేగులపాడు కేజీబీవీ, గంగంపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థులకు పాఠశాలల హెచ్ఎంలు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్