వీరఘట్టం మండలంలో ఈనెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు కౌలు రైతుల నుంచి రుణ అర్హత కార్డుల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తహశీల్దార్ కే. జయప్రకాశ్ మంగళవారం తెలిపారు. మండలంలో సుమారు 350 మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి సంబంధిత వీఆర్తో, అగ్రికల్చరల్ అసిస్టెంట్, డిప్యూటీ తహశీల్దార్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.