వాహన చట్టాలపై అవగాహన ఉండాలి

71చూసినవారు
వాహన చట్టాలపై అవగాహన ఉండాలి
మన్యం జిల్లాలో వాహన చట్టాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన ఉండాలని పాలకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విజయరాజ్ కుమార్ సూచించారు. బుధవారం పాలకొండ న్యాయస్థానం ఆవరణలో ఆటో డ్రైవర్లకు వాహన చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపినప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగే అనర్ధాలను వివరించారు. తమ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్