భామిని మండలం బత్తిలి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్సై అమ్మనరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు బత్తిలి గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చెయ్యగా సంఘటన స్థలంలో కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న నగదు రూ 25200 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.