పాలకొండ మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన సందర్భంగా లంబూరులో జల్ జీవన్ మిషన్ పనులను, ఎం. సింగుపురంలోని ప్రాథమిక పాఠశాలను, ఆసుపత్రిని పరిశీలించారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.