పాలకొండలో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ

61చూసినవారు
పాలకొండలో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ
పాలకొండ మార్కెట్లో నిత్యవసర సరుకులు ధరలు మండుతున్నాయి. దీంతో స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం, తదితర నిత్యావసర సరుకులను ప్రజలకు అందజేసేందుకు చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు పాలకొండలోని బీ-మార్ట్, రిలయన్స్ మార్టుల వద్ద గురువారం పాలకొండ ఆర్డీఓ రమణ ప్రజలకు కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్