వీరఘట్టం మండలం గంగంపేట ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 100 కి పైగా విద్యార్థులకు బివివిఎస్ నారాయణరావు, స్వరూపరాణి దంపతులు ఆదివారం ఉచితంగా వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. పరిసరాలు పర్యావరణం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. భాస్కరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు వీఏ భాస్కరరావు, రవికుమార్ పాల్గొన్నారు.