నిలిచిన పాలకొండ చైర్ పర్సన్ ఎన్నిక

55చూసినవారు
నిలిచిన పాలకొండ చైర్ పర్సన్ ఎన్నిక
పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోరం లేక సోమవారం నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సబ్‌కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి కౌన్సిల్‌ సమావేశాన్ని మరలా మంగళవారం నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం సబ్‌కలెక్టర్‌, కమిషనర్‌ సామంచి సర్వేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జయకృష్ణ పలువురు సభ్యులు హాజరైనా వైసీపీ సభ్యులు హాజరుకాక కోరం లేక చైర్‌పర్సన్‌ ఎన్నిక నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్