శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను మంగళవారం కలెక్టర్ వారి కార్యాలయంలో పాలకొండ డివిజన్ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్ పాల్గొన్నారు.